గద్వాలలో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు

పయనించే సూర్యుడు తేదీ 03 జనవరి జోగులమ్మ గద్వాల జిల్లా ప్రతినిధి రిపోర్టర్ బోయ కిష్టన్న. విశ్వశాంతి మహా యజ్ఞాన్నికి తన వంతు సహాయం స్వామి శ్రీ కృష్ణ తేజ స్వరూపానంద కు 1,00,000/- ఒక లక్ష రూపాయలు అందించిన శ్రీ బండ్ల రాజశేఖర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాలలో శ్రీ కృష్ణ కాలచక్ర మహా యాగం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో భాగంగా.శ్రీ రమ్య ఇండస్ట్రీస్ అధినేత శ్రీ బండ్ల రాజశేఖర్ రెడ్డి గారు* శుక్రవారం రోజు జరిగే విశ్వశాంతి మహా యజ్ఞానికి తన వంతు సహాయం గా స్వామి శ్రీ కృష్ణ తేజ స్వరూపనంద గారికి 1 లక్ష రూపాయలను ధర్మ కార్యానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల రాజశేఖర్ రెడ్డి కు వీరి కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అని స్వామి వారు తెలిపారు.