గ్రామపంచాయతీ, రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలి

* ఎమ్మార్వో, ఎంపీడీవో కు రామగిరి బిజెపి నాయకుల వినతి పత్రం * ప్రోటోకాల్ పాటించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి జిల్లా, సెంటినరీకాలనీ-03:- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలో మరియు రేషన్ షాపుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయాలని మండల ఎమ్మార్వో ఎంపీడీవోలకు రామగిరి మండల బిజెపి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు 80 శాతం నిధులు ఇస్తూ మరియు పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని, కానీ తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీలో రేషన్ షాపుల్లో నరేంద్ర మోడీ చిత్రపటం ఏర్పాటు చేయకుండా ప్రోటోకాల్ ని తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. ఈ రెండు శాఖలకు సంబంధం లేని మంత్రుల ఫోటోలు పెడుతూ ప్రధాని ప్రోటోకాల్ ని విస్మరిస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే అన్ని గ్రామపంచాయతీల్లో రేషన్ షాపుల్లో ప్రధాని చిత్రపటం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనే తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటాలా లెక్క చెప్పకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పంచాయతీల్లో సర్పంచులు లేకపోవడం వల్ల 3000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని కేంద్ర ప్రభుత్వం జోక్యం వల్లనే రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తొట్ల రాజు, ఉపాధ్యక్షుడు నాంసాని మహేష్, కార్యదర్శి కొత్త కమలాకర్, బత్తిని శివ ఓబీసీ అధ్యక్షుడు మైదానం సందీప్, మండల పట్టణ అధ్యక్షుడు చిదురాల శివ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *