పయనించే సూర్యుడు జనవరి 3(ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండల్ నల్గొండ జిల్లా) జనవరి 18న, ఖమ్మం నగరంలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వందేళ్ళ ముగింపు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు తరలిరావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు శుక్రవారం డిండి సిపిఐ కార్యాలయంలో జరిగిన మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండ సిపిఐ జెండా, దున్నేవాడికి భూమి నినాదంతో లక్షలాది ఎకరాలు పేదలకు పంచిన ఘనమైన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక భూస్వామ్య పెట్టుబడుదారు వర్గాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దని అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి నేటితో 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని దేశంలో 100 సంవత్సరాల ఉద్యమ పార్టీగా సిపిఐ ఖ్యాతి పొందిందని అన్నారు. గ్రామాల్లో సిపిఐ గ్రామ శాఖల సమావేశాలను నిర్వహించి నూతన సభ్యత్వం,సభ్యత్వ పునరుద్దరణ చేయాలని అన్నారు.ప్రజల్లోకి పార్టీ నాయకులు శాఖ సమావేశాల ద్వారా పార్టీ చరిత్రను ప్రజలకు తెలిసేలా కార్యకర్తలను చైతన్యం చేయాలని సూచించారు.అనంతరం సిపిఐ అగ్ర నేత,మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ.బి.బర్ధన్ 10వ, వర్ధంతి సందర్బంగా కామ్రేడ్ బర్ధన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ బర్ధన్ జీవితం స్ఫూర్తి దాయకమని ఆయన ఆశయాలకు పునరంకితమవ్వాలని శ్రేణులకు బుచ్చిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సిపిఐ తరుపున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిసిన నూతన సర్పంచ్ లను, వార్డు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల సహాయ కార్యదర్శి తిప్పర్తి విజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనోద్దీన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,కార్యవర్గ సభ్యులు హనుమండ్ల కేశవులు,సోమిడి శ్రీనయ్య,నూనె వెంకటేశ్వర్లు,ఎనమల్ల నవీన్ పాల్గొన్నారు.