ట్రాఫిక్ నియమాలను పాటించవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది

* ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించి ప్రాణ దాతగా నిలిచిన వారికి ప్రభుత్వం పక్షాన 20,000 రూపాయల ప్రోత్సాహం * జిల్లా ఆర్.టి.ఎ మెంబర్ పడాల రాహుల్

పయనించే సూర్యుడు జనవరి 3 కరీంనగర్ న్యూస్: 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రేణిగుంట టోల్గేట్ వద్ద సీటు పెట్టు ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుట మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమం జిల్లా రీజనల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనవరి 1 నుండి 31 తేదీ వరకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జరుగుతున్న రోడ్ ప్రమాదాలనునియంత్రించడానికి ప్రజలకు అవగాహన కలిగించడంలో భాగంగా నూతన సంవత్సరం మొదటి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని ప్రతి నూతన సంవత్సరం రోజున మనమంతా ఏదో ఒక నూతన విధానానికి లేదా ఒక మంచి పనిని ప్రారంభించడానికి ప్రణాళిక చేసుకుంటాము, కార్యక్రమం ఏదైనా అది కార్యరూపం దాల్చాలంటే మనం జీవించి ఉండాలనేది ప్రధానమైన అంశం నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సంస్కృతిలో భాగంగా కుటుంబంలో వెలుగులు నింపడంతో పాటు మంచి జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచనలకు భిన్నంగా దురదృష్టవశాత్తు కొంతమంది మద్యం సేవించి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారిని చూశాము అయితే దేశాన్ని ముందుకు నడిపించగల శక్తి ఉన్న యువకులే ఈ విధమైన ప్రమాదాలకు గురి కావడం శోచనీయo వాటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని జాతీయ భద్రత మహోత్సవాలలో భాగంగా అటు కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కంకణ బద్ధులై రవాణా శాఖ ఆధ్వర్యంలో క్రియాశీలకంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమం ఒక విప్లవంలా ప్రజల మధ్యకు వెళుతుందని సదుద్దేశంతో 31 రోజులపాటు ప్రతిరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా రోజువారి ప్రణాళిక రచించి ఆ బాధ్యతను రాష్ట్రస్థాయిలో రవాణా శాఖ అధికారులు మరియు ఆర్టిఏ మెంబర్ లపై పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నేడు రెండవ రోజున కరీంనగర్ లో వాహన దారులు కార్లు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు కారులో తమతో ప్రయాణిస్తున్న తమ యజమానులకు వారి కుటుంబ సభ్యులకు సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని సూచనలు చేయాలని ఈ బాధ్యత వాహనం నడిపే డ్రైవర్ పై తప్పక ఉంటుందని వారి చేతులో కొంత మంది ప్రాణాలు ఉన్నాయని గుర్తించాలని కోరుతున్నాము ఈ నెల రోజులపాటు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించి ప్రభుత్వం మరియు రవాణా శాఖ చేస్తున్న సూచనలను మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు తప్పక తెలియజేయాలని ట్రాఫిక్ నిబంధనలతో పాటు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ వళిని పాటించవలసిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఒక్క ప్రాణాన్ని అయినా కాపాడతానని నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము జాతీయ రహదారులలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే 108కు సమాచారం అందించడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని ఈ విషయంలో పౌరులు ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సకాలంలో స్పందించి ప్రాణదాతలుగా నిలిచిన వారికి ప్రభుత్వం పక్షాన జిల్లా కలెక్టర్ ద్వారా 20వేల రూపాయలు నగదు ప్రోత్సాహం అందజేయడం జరుగుతుందని ప్రమాదంలో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో 1,50,000రూ.ల విలువ గల వైద్యం అందజేయడం జరుగుతుందని ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి చూడాలని పడాల రాహుల్ గారు పౌరులను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డి.టి.ఓ శ్రీకాంత్ చక్రవర్తి ఎం వి ఐ రవి కుమార్ ఎం వి ఐ లు స్రవంతి హరిత యాదవ్ ప్లాజా మేనేజర్ దుర్గా రావురావు రవాణా శాఖ కానిస్టేబుల్స్ టోల్ ప్లాజా సిబ్బంది, వాహన దారులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *