ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలి

★ బోధన్ ఎంవీఐ శ్రీనివాస్. ★ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ ను వివరిస్తున్న ఎంవీఐ శ్రీనివాస్.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 బోధన్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడపాలని బోధన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు 2025లో భాగంగా శుక్రవారం సాలూర మండల కేంద్రంలోని ప్రజ్ఞ శ్రీ హై స్కూల్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంపై విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందంచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఎంవీఐ మాట్లాడుతూ విద్యార్థులు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాహనాలను నడపాలని తెలిపారు. ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని, అదేవిధంగా కారును నడిపే సమయంలో సీట్ బెల్ట్ ను ధరించి వాహనం నడపాలని, వాహనం నడిపే సమయంలో సెల్ ఫోను వాడకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి పాఠశాల కరస్పాండెంట్ మిద్దెల రాజు విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.