
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 3 పెనుగంచిప్రోలు గ్రామంలోని ది.02.01.2026 శుక్రవారం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం మరియు పెద్ద తిరునాళ్ల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ అన్ని శాఖల వారు అమ్మవారి రంగుల మహోత్సవము మరియు పెద్ద తిరునాళ్ళు మహోత్సవమును విజయవంతం చేయవలసినదిగా వివిధ శాఖల సిబ్బందికి సూచనలు సలహాలు జారీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనర్ మరియు కార్య నిర్వహణాధికారి, డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసిపి. తిలక్, సిఐపి వెంకటేశ్వరరావు. ఆర్డీవో బాలకృష్ణ. తాసిల్దార్ శాంతిలక్ష్మి , పెనుగంచిప్రోలు ఎస్సై కే అర్జున్ మరియు. ఫెస్టివల్ కమిటీ మెంబెర్ చుంచు. రమేష్ , పిహెచ్సి , అగ్నిమాపక సిబ్బంది , కార్యనిర్వహక ఇంజనీరు మరియు వివిధల శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఉప కమీషనర్ కార్య నిర్వహణాధికారి మహేశ్వర్ రెడ్డి తెలియ పరిచారు
