తిరుమలాపురం అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

పయనించే సూర్యుడు 3-12-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలపురం గ్రామ అంబేద్కర్ సంఘ భవనంలో మాదిగ కుల ఎన్నికలు నిర్వహించారు సంఘం అధ్యక్షులుగా చిర్ర చంద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. కాగా , ఉపాధ్యక్షులు ఆరేల్లి చిన్న నర్సయ్యా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల ఆశయ్య కోశాధికారి బిరుదుల రాజయ్య కార్యదర్శి దొనకొండ రాజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కుల పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైన చిర్ర చంద్రయ్య మాట్లాడుతూ… నా పైన నమ్మకంతో అధ్యక్షుని పదవి బాధ్యతలు అప్పగిస్తున్న తోటి సంఘం పెద్దలకు, సంఘ సభ్యులకు, యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి, హక్కులకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.