తిరుమల సేవా సమితి సభ్యురాలు కుమారి అద్విక పుట్టినరోజు సందర్భంగారేకుర్తి లో శివసాయి హెల్త్ కేర్ సొసైటీ లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

పయనించే సూర్యుడు జనవరి 3 కరీంనగర్ న్యూస్: మానవసేవయే మాధవసేవ అనే ఆశయంతో వివిధ సేవా కార్యక్రమాలకు ముందు ఉండాలని శ్రీ తిరుమల సేవా సమితి కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా రేకుర్తిలోని శివ సాయి జిర్యాట్రిక్ హెల్త్ కేర్ సొసైటీ వారి వృద్ధుల చికిత్స ఆశ్రమ సేవా కేంద్రంలో తిరుమల సేవా సమితి సభ్యురాలు అయినటువంటి కుమారి అద్విక పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని 40 మంది వృద్ధులకు భోజనం అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాతల సహాయంతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శ్రీ తిరుమల సేవా సమితి కృషి చేస్తుందని సేవాసమితి అధ్యక్షురాలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సమితి టీం లీడర్లు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు