పయనించే సూర్యుడు జనవరి 03, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం నరసింహపురం గ్రామంలో సర్పంచ్ లోయ ఉపేందర్, ఉపసర్పంచ్ దొడ్డ వీరబాబు అంగన్వాడి కేంద్రాలు 2,& 3 ను సందర్శించారు. ఈ సందర్భంగా కొత్త గర్భిణీ నమోదు కార్యక్రమంలో పాల్గొని, ప్రీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ లు పంపిణీ చేశారు. నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ టి. విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు జి. పద్మ, టి. రేణుక ఆశ పి. జయమ్మ, గ్రామ పెద్దలు, గర్భిణీలు మరియు ఏ ఎల్ ఎం ఎస్ సి సభ్యులు పాల్గొన్నారు.
