నూతన బోర్ వెల్ ప్రారంభిస్తున్న రఘునాథ్

★ మాటమీద నిల్చుండడమే బిజెపి లక్ష్యం. ★ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి

పయనించే సూర్యుడు జనవరి 3 దండేపల్లి దండేపల్లి ఇచ్చిన మాటమీద నిల్చోవడమే బిజెపి లక్ష్యమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘు నా థ్ వెరబెల్లి అన్నారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని మోకాసిగూడ లో గత రెండు సంవత్సరాలనుండి నీటి సమస్య ఉండడంతో గ్రామ ప్రజలకు నీటి సమస్య ఉండకూడదని గ్రామస్తుల సౌకర్యార్థం నూతన బోర్ వెల్ వేయించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నందుర్క సుగుణ ను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం తన స్వంత నిధులు రూ.10లక్షలు ఇస్తానన్న మాట ప్రకారం 10 లక్షల తో పాటు, వచ్చేది వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని మొదట బోర్ వెల్ వేయించి గ్రామప్రజల దాహం తీర్చలనే ఉద్దేశ్యం తో మొందుగా బోర్ వెల్ వేసి గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టమన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్,నందుర్క సుగుణ, ఉపసర్పంచ్ పూదరి రమణయ్య, వార్డు సభ్యులు, మామిడిపల్లి రఘు బిజెపి నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.