నూతన సంవత్సరాన్ని పురస్కరించుకున్న తహసీల్దార్ సిబ్బంది

★ వెల్లడ మండల తహసిల్దార్ సిబ్బంది

పయనించే సూర్యుడు, జనవరి 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల మండల కేంద్రంలోని తాసిల్దార్ ఆఫీస్ లో డిప్యూటీ తాసిల్దార్, గిర్ధవరి, గ్రామపంచాయతీ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ మండల కమిటీని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వెల్దండ మండల అధ్యక్షునిగా కిషన్ ప్రసాద్, కార్యదర్శిగా ముత్తమ్మ, కోశాధికారిగా శ్రీలత, ఉపాధ్యక్షురాలుగా శోభ, సభ్యులుగా శ్రీనివాసులు, సిద్దయ్య లను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి నూతన కమిటీని తహసిల్దార్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలియపరిచారు. అలాగే నూతన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్ ని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల గిర్ధవర్లు, గ్రామ పరిపాల అధికారులు లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.