పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 03 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలంలోని మహితాపూర్ గ్రామంలో ఉన్నవటువంటి సమస్యలపై గ్రామంలోని వార్డులు, పలు సమస్యలు పరిష్కరించుట కొరకు గ్రామ సర్పంచ్ తలారి నాగమణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డితో కలిసి వార్డు సభ్యలు గ్రామంలో సందర్శించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి రెండు మంచి నీటి బావులలో పాటు, పాత స్కూల్ యందు ఉన్న మినిరల్ వాటర్ ప్లాంట్ రిపేర్ చేయించి గ్రామ ప్రజలకు నిత్యం 5 రూపాయలకి 20 లీటర్ల మంచి నీరు అందిచాలని,గ్రామంలోని స్మశాన వాటికను పరిశీలించి అక్కడ చుట్టూ ప్రహరీ గోడను కరెంట్ స్థంభం వేయించాలని, గ్రామంలోని వార్డులలో కనీసం 80 పైగా కరెంట్ స్థంబాలు కొత్తగా మంజూరు అవసరమని, విద్యుత్ అధికారులకు సమస్యను వివరించమని అలాగే ఉత్తర వాడ రెడ్డి కల్యాణ మండపం వద్ద కుమ్మరి కుంట నుండి వచ్చే వరదను రోడ్డు మీదికి రాకుండా అక్కడ పెద్ద పైపులు వేయించి మురికి కాలువ నిర్మాణం చేసినట్లు అయితే ఆ దారి నుండి నుండి నడిచే వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనంకరంగ ఉంటుంది అని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, గ్రామ సర్పంచ్ తలారి నాగమణి, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్, వార్డు సభ్యలు అనుమల్ల రమ, కొల్ల ప్రమీల, నేమిల్ల లత, లింగంపెల్లి లక్ష్మణ్, బుస గంగ మల్లయ్య, బొమ్మేన బాబు, భూపెల్లి పరమేష్, నవీన్, శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు, అనుమల్ల సత్యనారాయణ, తలారి రాజేష్, నేమిల్ల స్వామి రెడ్డి, కొల్ల నారాయణ, కొల్ల వేణు, పురాణం భవాని, నేమిల్ల నారాయణ, సద్ది లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు..