
పయనించే సూర్యుడు జనవరి 3 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం పల్లిపాడు గ్రామంలో రైతుల పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం సభ జరిగింది. సభాధ్యక్షుడిగా జ్ఞానేష్ ఉన్న ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి, జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న హాజరైనారు. ఈ సభలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఎన్ చంద్రబాబు నాయుడు ఆదేశం ప్రకారం జరిగిందని, రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు ఆర్థికంగా ఎంతో సాయం చేశారని, వైయస్ జగన్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎంతో నష్టపోయారని ఎన్ రాఘవేంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ వీరిద్దరి నాయకత్వంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారని, రైతులను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని లక్ష్మన్న తెలిపారు. ఈ సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాసిల్దారు , మరియు అఫీషియల్స్, ఎస్ఐరమేష్ రెడ్డి,టిడిపి కోసిగి మండల అధ్యక్షులు పి రామి రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నాడిగేని అయ్యన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, పక్కరాణి వెంకటేశులు, కోసిగయ్య,వీరేష్, రాజేంద్ర, నాగిరెడ్డి టిడిపి ముఖ్య నాయకులు టిడిపి కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.