పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ కార్యక్రమం

పయనించే సూర్యుడు జనవరి 3 (జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న) పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు వచ్చే నట్టల రోగమును నివారించుటకు పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇంజక్షన్లు, మాత్రలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లంపల్లి గ్రామ సర్పంచ్ పోశాల వెంకన్న ముఖ్య అతిథిగా విచ్చేసి గొర్రెలకు నట్టల ఇంజక్షన్ ను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెలకు వచ్చే సీజనల్ వ్యాధులకు వైద్యశాఖ వారు ఇచ్చే మందులను, గొర్రెల మేకల పెంపకం దారులు తప్పనిసరిగా వేయించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అధికారి డాక్టర్ జి రమ్య, మరియు జె వి డి ,శివప్రసాద్, గోపాలమిత్ర సిహెచ్ సోమన్న, పశు మిత్ర సిబ్బంది సిహెచ్ సంధ్య, బి అనిత గ్రామ కారోబార్ తాళ్లపల్లి ఎల్లయ్య, గిరగాని సుధాకర్, యాదవ సంఘం నాయకులు, పెంపకం దారులు పాల్గొన్నారు,