పయనించే సూర్యుడు జనవరి 3 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కె.శ్రవణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం పాపగల్ గ్రామంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ సాల్వాది కూర్మయ్య ఉప సర్పంచ్ షేక్ జాలిల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతం కొంతకాలంగా ఐమాక్స్ లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పేర్కొన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్ గా పదవులు పొందిన కొన్ని రోజుల్లోనే ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.