​ పాలెం గ్రామ సర్పంచ్ రామకృష్ణను సన్మానిస్తూ 5వ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి వినతి

* కార్యక్రమంలో. బేడ బుడగ జంగం గ్రామ అధ్యక్షులు వెంకటయ్య ప్రధాన కార్యదర్శి అశోక్

పయనించే సూర్యుడు జనవరి 3 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఈరోజు బిజినపల్లి మండలంలోని పాలెం గ్రామ 5వ వార్డులో ఉన్న బేడ బుడగ జంగాల కాలనీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం నాయకులు శుక్రవారం గ్రామ సర్పంచ్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ​ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కాలనీలో గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల సమస్యలు వేధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా: డ్రైనేజీ సమస్య: సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయి దోమలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ​సంక్షేమ పథకాలు: అర్హులైన నిరుపేదలకు ఇళ్లు, వృద్ధాప్య మరియు వికలాంగుల పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ​వీధి దీపాలు: కాలనీలో వీధి దీపాలు వెలగక రాత్రి సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వీటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.సంబంధిత అధికారులు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఉపసర్పంచ్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రామ బేడ బుడగ జంగం సంఘం అధ్యక్షులు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్, రామకృష్ణ, ఆంజనేయులు, గుర్రప్ప, తిరుపతయ్య, రమేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. ​స్పందన: వినతిపత్రం స్వీకరించిన సర్పంచ్ మరియు అధికారులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *