పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 3, తల్లాడ రిపోర్టర్ స్థానిక మండల కేంద్రంలో పి ఆర్ టి యు తెలంగాణ క్యాలెండర్ ను తల్లాడ మండల విద్యాధికారి నెమ్మకంటి దామోదర ప్రసాద్, స్థానిక తల్లాడ మండలం కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులు రాయల నరసింహ రావు, మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావలసిన పెండింగ్ బిల్స్ పెండింగ్ లో ఉన్న 6 డిఏలు చెల్లించాలని, నూతన పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉంగరాల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అద్దంకి గోపాల క్రిష్ణ, నూతనకల్ హెచ్ఎం ఏ.రమేష్ మండల కార్యవర్గ సభ్యులు కె.భాస్కర్, వేంకటేశ్వర రెడ్డి మండల మహిళా అధ్యక్షరాలు జి.సరోజిని సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.