పయనించే సూర్యుడు జనవరి 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రిపోర్టర్ మండల పరిధిలోని కొత్త కావడిగుండ్ల సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా గ్రామ కమిటీ సభ్యుడు కామ్రేడ్ పూనెం ముత్యాలు మరణం ఈ ప్రాంత ఉద్యమానికి తీరని లోటని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ అన్నారు. కామ్రేడ్ పూనెం ముత్యాలు అనారోగ్య కారణాలతో మృతి చెందగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గోకినపల్లి ప్రభాకర్ మరియు వారి బృందం ముత్యాలు మృతదేహంపై ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూనెం ముత్యాలు జీవించినంత కాలం పార్టీ సభ్యుడిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడని, ఆ కామ్రేడ్ మరణం సీపీఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా కొత్త కావడిగుండ్ల ప్రాంతంలో పార్టీ పురోభివృద్ధికి తోడ్పాటు అందించాడని అటువంటి కామ్రేడ్ మరణం ఆ ప్రాంత విప్లవజమానికి తీరని లోటని ఆలోటును మనం పూర్తి చేయటమే ఆయనకు మనం అర్పించే నివాళి అని అన్నారు. ఇంకా ఈకార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, గ్రామ కమిటీ సభ్యులు కొమరం లక్ష్మి, జెడ్డి బుచ్చయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.