ప్రమాదకర కూడలిలో కల్వర్టు నిర్మాణం చేపట్టాలి

★ ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు సీపీఐ వినతి

పయనించే సూర్యుడు జనవరి 03 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని పట్టణం 17వ వార్డులోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిని కలిసే ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారిందని, అక్కడ తక్షణమే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆదోని పట్టణ కార్యదర్శి టి.వీరేష్ ఆధ్వర్యంలో ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.ఈ ప్రాంతంలో ఆర్‌ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలతో పాటు సెయింట్ ఆంతోని హై స్కూల్ ఉన్నాయని, అలాగే నాలుగు సచివాలయాల పరిధిలోని విద్యార్థులు రోజూ ఈ రహదారిని దాటి పాఠశాలలకు వెళ్తూ వస్తూ ఉంటారని సీపీఐ నాయకులు తెలిపారు. ఈ సమయంలో తెలియని వాహనాలు, అతివేగంగా వెళ్లే వాహనాల వల్ల విద్యార్థులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా రైల్వే స్టేషన్ నుంచి ఎమ్మెల్సీ పాయింట్ వరకు సరుకులు తరలించే భారీ వాహనాలు కూడా ఇదే రహదారిని వినియోగిస్తున్నాయని, రోడ్డు ఎత్తు భాగంలో ఉండటంతో భారీ వాహనాలు అతివేగంగా ప్రధాన రోడ్డులోకి ఎక్కాల్సి వస్తోందని తెలిపారు. గతంలో ఇక్కడ కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి కావున విద్యార్థులు, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సంబంధిత ప్రాంతంలో తక్షణమే కల్వర్టు నిర్మాణం చేపట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌ను కోరినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా జిల్లా సమితి సభ్యులు ఏ. విజయ్,సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి కే రమేష్ ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, మారెప్ప గోపాల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.