బిజెపి బోధన్ పట్టణ శాఖ సన్నాహక సమావేశం

★ సమావేశంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ★ బిజెపి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 బోధన్ : త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న సందర్బంగా బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ కార్యాలయం లో నిర్వహించిన బోధన్ పట్టణ శాఖ సన్నాహక సమావేశం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతు మోదీజీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతి ఇంటి ముందు చేరి వివరించాలని . ఆయుష్ మాన్ భారత్, పి.ఎం.ఆవాస్ యోజన, ఉజ్వళ గ్యాస్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, జన్ ధన్ యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధి ఆలస్యం వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపె లక్ష్యంగా అందరూ ఒక్కటై పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కంద గట్ల రాంచందర్, జిల్లా కార్యదర్శి రాధాక్క, జిల్లా సోషల్ మీడియా కన్వినర్ కూరెళ్ల శ్రీధర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.