బోధన్ సబ్ కలెక్టర్ జెడ్‌పీహెచ్‌ఎస్‌, గోవూర్ పాఠశాలను సందర్శించారు.

పయనించే సూర్యుడు జనవరి 3 చందూర్ రిపోర్టర్ ఈ సందర్భంగా మిడ్‌లైన్ మరియు బేస్‌లైన్ పరీక్ష పత్రాలను పరిశీలించి, నివేదికలను సమీక్షించి, 6వ తరగతి విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు. విద్యా ఫలితాలను మెరుగుపరచడంతో పాటు సమగ్ర విద్యా నైపుణ్యాల అభివృద్ధికి విలువైన సూచనలు అందించారు. అనంతరం, సబ్ కలెక్టర్ ఎంపీపీఎస్‌, గోవూర్ పాఠశాలను సందర్శించి, ఎఫ్‌ఎల్‌ఎన్ బేస్‌లైన్ మరియు మిడ్‌లైన్ పరీక్షలను పరిశీలించి, 3వ మరియు 4వ తరగతి విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు.ఈ కార్యక్రమం లో ఎమ్ ఇ ఓ నాగనాథ్ ఉన్నారు