పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 03.01.2026 అన్నమయ్య జిల్లా మదనపల్లె పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) శక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల అభిషేకాన్ని సాంప్రదాయపద్ధంగా నిర్వహించారు ఉదయాన్నే అమ్మవారికి విషెస్ అభిషేకము అలంకరణ నిర్వహించారు అనంతరం రాహుకాల సమయంలో భక్తుల సమక్షంలో అమ్మవారిని అభిషేకించారు రాహుకాల అమ్మవారిని అభిషేకించడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందన్న భక్తుల విశ్వాసం దీంతో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు దేవస్థానం ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆలయ అధికార సిబ్బంది భక్తులకు సేవలు అందించారు