మండల సమైక్యలో పకృతి వ్యవసాయం పైన అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు జనవరి 3 బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఓ జయ ప్రసాద్ బ్రహ్మంగారి మఠం మండల కేంద్రమైన వెలుగు కార్యాలయంలో శుక్రవారం వెలుగు ఏపిఎం సీతారామిరెడ్డి అధ్యక్షతన పకృతి వ్యవసాయ పద్ధతుల్లో పిఎండిఎస్ ఏ గ్రేడ్ మోడల్ ఏటీఎం మోడల్ పైన అవగాహన సదస్సును మండల పరిధిలోని అన్ని వివో ఓబి లు ఎమ్మెస్ ఓబి లు సీసీలు వివో ఏ లు పకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జీలు ఐసిఆర్పి లు అందరి ఆధ్వర్యంలో జరిగాయని వారు తెలియజేశారు ఈ సందర్భంగా ఏపీఎం సీతారామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రతి సంవత్సరం జరిపే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను ఈ సంవత్సరం కూడా పకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మన గ్రామాలలో సర్వే చేపడతారని వారికి వివో ఓబిలు వివో ఏ లు అందరు కూడా కలసి సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని వారు తెలియజేశారు మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రసాయన పురుగు మందులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఘనజీవామృతం ద్రవ జీవామృతం విత్తన శుద్ధి చేయడం వల్ల భూమి గుల్లబారి నత్రజని భూమిలో ఎక్కువగా ఉంటుందని వారు తెలియజేశారు సిసి బాలయ్య మాట్లాడుతూ రసాయన పురుగుమందులు వాడటం వల్ల భూమిలో పోషకాలు తగ్గి సరైన దిగుబడి రైతుకు రావడంలేదని ప్రకృతి వ్యవసాయం మనం వ్యవసాయం చేస్తే భూమిలో సూక్ష్మజీవులు అధికముగా ఉత్పత్తి చెందటమే కాకుండా మనుషులు కూడా ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వారు తెలియజేశారు ఎఫ్ఎమ్ టి శ్రీనివాసులు మాట్లాడుతూ భక్తుతి వ్యవసాయం చేయు రైతులకి కషాయాలు ఘనజీవామృతం జీవామృతం నీ మాస్త్రం అజ్ఞాస్త్రం బ్రహ్మాస్త్రం చేప పిల్లల ద్రావణం వీటి ఉపయోగాలు వాడకం గురించి తెలియజేసి అందరికీ అందుబాటులో నంది పల్లె లో బి ఆర్ సి సెంటర్ ను ఏర్పాటు చేశామని రైతులు దీనిని సద్వినియోగం చేసుకొని కషాయాలు తెచ్చుకొనే మన పొలాలకు అల్లుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జీలు జయప్రసాద్ గోపాలమ్మ ఐ సి ఆర్ పి లు వివో ఏ లు వివో ఓబి లు సీసీలు అకౌంటెంట్ అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు