మన తెలంగాణ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 03 మామిడిపెల్లి లక్ష్మణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా మన తెలంగాణ పత్రిక అందిస్తున్న సేవలు మరువలేనివి అని తహసిల్దార్ నాగార్జున అన్నారు.శుక్రవారం రాయికల్ తహశీల్దార్ కార్యాలయంలో మన తెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి–ప్రజలకు వారధిగా నిలుస్తూ మరింత సమగ్రంగా,విశిష్టమైన కథనాలను పాఠకులకు అందించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడే విధంగా పత్రిక అందిస్తున్న సేవలు మరింత విస్తరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ దేవదాస్, పద్మయ్య,మన తెలంగాణ రిపోర్టర్ అందె రంజిత్,టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సభ్యులు నాగిరెడ్డి రఘుపతి, జెఏసి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వాసరి రవి,పాత్రికేయులు సింగిడి శంకర్,కడకుంట్ల జగదీష్, చింతకుంట సాయికుమార్,గంట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.