మా వేతనాలు చెల్లించండి

పయనించే సూర్యుడు పాలకొండ జనవరి 3 ప్రతినిధి జీ రమేష్ పాలకొండ నగర పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతర సభ్యులతో కూడిన మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సంఘ అధికార ప్రతినిధి ధావాల రమణారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది గత మూడు నెలలుగా ఎటువంటి వేతనాలు కార్మికులకు అందడం లేదు పండగ దగ్గర పడుతున్న కులదీ ఆందోళన చెందుతున్నామని మా కుటుంబ సభ్యులతో భార్యా పిల్లలతో ఈ సంక్రాంతిని ఎలా జరుపుకోవాలి అని ప్రభుత్వము వెంటనే తక్షణమే స్పందించి మాకు మూడు నెలలుగా బాకీ ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని నాయకులు కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకొండ మున్సిపల్ పారిశుధ్య కార్మిక సిబ్బంది మరియు అధికార ప్రతినిధి దావల రవణ రావు పాల్గొనడం జరిగింది. పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ స్పందించి ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేశారు