ముందు జాగ్రత్తలు తోనే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చు

★ ఎస్సై మహేష్

పయనించే సూర్యుడు న్యూస్ 03-01-25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివ్వెంల పోలీసులు ఖమ్మం జాతీయ రహదారి వెంట వట్టి ఖమ్మంపాడు స్టేజి ఐలాపురం స్టేజీల వద్ద ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు రోడ్డు భద్రతా నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ముందు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని విజ్ఞప్తి చేశారు.