రాజు ముద్ర తో నూతన పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నానాజీ

పయనించే సూర్యుడు జనవరి 3, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) గత ప్రభుత్వంలో తమ సొంత బొమ్మలను వేసుకుని రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అంటూ ఇచ్చారని కానీ కూటమి ప్రభుత్వం రాజు ముద్రతో రైతులు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం, తమ్మవరం పంచాయతీ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామంలో తహశీల్దారు కుమారి అద్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యి రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూమి రీసర్వే పూర్తి చేసి, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని ప్రారంభించిందని, జనవరి 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పథకం రైతుల హక్కులను రక్షించడానికి, భూమి వివాదాలనుపరిష్కరించడానికి ఉద్దేశించబడిందని రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పంతం నానాజీల చొరవతో తమసమస్యలుపరిష్కరింపబడ్డాయి రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, మాదారపు తాతాజీ, కర్రెడ్ల గోవింద్,జి రామస్వామి,జి వెంకట రమణ, జి బాబి, జి వీరబాబు, జి లోకేష్ జి త్రిమూర్తులు సి.హెచ్. రాజు, యై.సత్తిబాబు (వీఆర్వో) సెక్రెటరీ వెంకటరత్నం, జి. పాపారావు రైతులు తదితరులు పాల్గొన్నారు.