రెవిన్యూ పరంగా వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిచేస్తున్న కూటమి ప్రభుత్వం

పయనించే సూర్యుడు జనవరి : 3 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రెవిన్యూ పరంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి నాయకులు అన్నారు. రాజపూడి, వెంగయమ్మపురం, సీతారామపురం, కృష్ణాపురం గ్రామాల్లో రెవెన్యూ భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజపూడి సర్పంచ్ భూసాల విష్ణు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పుల కారణంగా రెవెన్యూ పరంగా లక్షలాది సమస్యలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వైసీపీ పాలన కారణంగా రెవెన్యూ సమస్యలు తీవ్రంగా సంక్లిష్టంగా మారాయని, సామాన్య ప్రజల భూమి రికార్డులు తారుమారై నేటికీ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వం పాస్ పుస్తకాల పంపిణీ, సర్వేల పేరుతో అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులపై ప్రజల హక్కులను కాలరాసే విధంగా, రాజముద్రతో ఇవ్వాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాలను వ్యక్తిగత ఫోటోలు, పార్టీ రంగులతో తప్పులతడకలుగా పంపిణీ చేశారని విమర్శించారు. వాటిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు.లక్షలాది రెవెన్యూ సమస్యలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటోందని, రెవెన్యూ మంత్రి అనగాని ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల భూమి హక్కులను దెబ్బతీసేలా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను కూడా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రేఖా బుల్లి రాజు, రాజపూడి సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు (బుల్లెబ్బు), వల్లెపు అన్నవరం, అప్పన వీరబాబు, గుడివాడ రాజారావు, గల్లా బాబ్జి, రెవెన్యూ అధికారులు, రాజపూడి, వెంగయమ్మపురం, సీతారామపురం, కృష్ణాపురం గ్రామాల రైతులు పాల్గొన్నారు.