రైతుల అవసరాలకు తగిన రుణాలు అందించాలని

★ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్

పయనించే సూర్యుడు జనవరి 3 కరీంనగర్ న్యూస్: రైతుల అవసరాలకు తగిన విధంగా బ్యాంకర్లు రుణాలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రెవెన్యూ పేర్కొన్నారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారు చేయడంపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జగిత్యాల సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ డిస్టిక్ లెవెల్ టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను బ్యాంకర్లు వివిధ శాఖల అధికారులు నిర్ణయించాలని సూచించారు పంటల సాగులో ఖర్చులు పెరిగిన దృష్ట్యా గత సంవత్సరం కంటే సేల్ ఆఫ్ ఫైనాన్స్ ను కొంతవరకు పెంచాలని అభిప్రాయపడ్డారు వరి పత్తి మొక్కజొన్నతో పాటు గోధుమలు కూరగాయలు చిరుతృణధాన్యాలు జొన్న రాగులు, నగదు పంటలకు అధిక రుణ పరిమితినీ కల్పించాలని సూచించారు సమావేశంలో జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించగా రైతులకు రుణాల మంజూరు ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఆయా పంటలకు సంబంధించి పంటల సాగులో పెట్టుబడులు ఆదాయము తో పాటు వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో 20 మంది రైతులు పాల్గొని సేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచే అంశంపై వారి అభిప్రాయాలను వెల్లడించారు ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు కరీంనగర్ ఎల్డిఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక మత్స్య శాఖ అధికారులు కేడిసిసి బి అధికారులు, బ్యాంకర్లు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు