పయనించే సూర్యుడు జనవరి : 3 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ రైతులకు సంబంధించిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కిర్లంపూడి మండల ఎంపీపీ తోట రవి అన్నారు. శుక్రవారం కిర్లంపూడి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రైతుల పాస్ పుస్తకాలపై వ్యక్తిగత ఫోటో ముద్రించారని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫోటోను తొలగించి, రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేడు సుమారు 10,153 పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.బూరుపూడిపాలెం, సోమరారణంపేట గ్రామాల్లో రీ-సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. రీ-సర్వే అనంతరం ఆయా గ్రామాల్లో కూడా నూతన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి, సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, కిర్లంపూడి సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు, తూము కుమార్, కాళ్ల వెంకటేష్, గొల్లపల్లి సూరిబాబు, ఎల్లపు దొరబాబు, శరకణ రాజబాబు, ఆళ్ళ నానాజీ, డీటీ శ్రీనివాస్, ఆర్‌ఐ సత్యదేవి, డీటీ సర్వేయర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.