రోడ్డుభద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలి

★ ఆర్టీవో అధికారులు

పయనించే సూర్యుడు జనవరి 03 ఉట్నూర్ ఉట్నూర్:- జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉట్నూరులో ఆర్టీవో అధికారులు డ్రైవర్లు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. రోడ్డుభద్రతపై సరైన అవగాహన కలిగి ఉన్నప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మోటారు వాహనాల పరిశీలకులు (ఎంవీఐలు) ఆశ్వంత్ కుమార్, ఫహిమా సుల్తానా, రంజిత్ కుమార్‌తో పాటు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.