పయనిచే సూర్యుడు జనవరి 3 కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎరుకుల మహేష్ బైచిగేరి - ఆరెకల్ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని మండలం పరిధిలోని కపటి గ్రామానికి చెందిన నాయక్ ఈరన్న, నాయక్ వీరేష్ మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను సందర్శించిన ఆయన, బాధితుల కుటుంబాలను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. ఈ ప్రమాదంపై మృతుల బంధువులు వ్యక్తం చేస్తున్న అనుమానాల దృష్ట్యా, అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.