లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విజేత పబ్లిక్ స్కూల్ విద్యార్థి బాకా రాజ్యవర్ధన్ రికార్డు విజయం

పయనించే సూర్యుడు జనవరి 3 ఖానాపూర్ (నిర్మల్ జిల్లా) సరూర్ నగర్ స్టేడియం, హైదరాబాద్‌లో నవంబర్ 23, 2025న నిర్వహించిన ‘లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ కార్యక్రమంలో విజేత పబ్లిక్ స్కూల్‌కు చెందిన హై స్కూల్ విద్యార్థి బాకా రాజ్యవర్ధన్ అద్భుత ప్రతిభను కనబరిచాడు. 30 నిమిషాల్లో అత్యధికంగా ‘రౌండీస్ కిక్స్’ నిర్వహించిన ఈ ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొని, విజయవంతంగా పూర్తి చేసి విజేతగా నిలిచి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా విజేత పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాస్ , ప్రిన్సిపాల్ కృష్ణవేణి విద్యార్థి బాకా రాజ్యవర్ధన్‌ను హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విజయం విజేత పబ్లిక్ స్కూల్ విద్యార్థుల క్రమశిక్షణ, క్రీడా నైపుణ్యాలకు నిదర్శనమని వారు తెలిపారు.