పయనించే సూర్యుడు, జనవరి 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్డండ మండలం నారాయణపూర్ తాండకు చెందిన రాత్లావత్ మధు నివాసం వద్ద ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సంఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మధుకు ధైర్యం చెప్పి మనోదరిగా ఉండాలని రాష్ట్ర కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మానవతా దృక్పథంతో రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్డండా మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, గ్రామ నాయక్ శ్రీను, వార్డు సభ్యులు కృష్ణ, స్థానిక నాయకులు రవి, భుజంగం, రమేష్, ప్రసాద్, వినోద్, శ్రీధర్ గ్రామస్తులు పాల్గొన్నారు.