పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 బోధన్ :శబరిమలకు పాదయాత్రగా వెళ్లి వచ్చిన అయ్యప్ప మాలాదారులు సత్యనారాయణ, శ్రీనివాస్, సిహెచ్.నారాయణ, గంగారాం, లక్ష్మణ్, గంగాధర్ పటేల్ లను బోధన్ లయన్స్ ఐ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ వారి ఆధ్వర్యంలో శుక్రవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. అయ్యప్ప మాలధారులు శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం ఎంతో అభినందనీయమని పిడిజి లయన్ పి.బసవేశ్వర రావు అన్నారు.పాదయాత్రగా వెళ్లి వచ్చిన వారిని సన్మానించడం పుణ్యకార్యమన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ శ్రీధర్, డిస్టిక్ హై క్యాంప్ చైర్మన్ సూరాబత్తుని శ్రీనివాసరావు, లయన్ సుబ్బారావు,అధ్యక్షులు గోవింద్ రెడ్డి, కార్యదర్శి పోశెట్టి, కోశాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.