సంకల్ప సాధన దిశగా అడుగులు వేయాలి

* సుప్రసిద్ధ దర్శక, నిర్మాతలు ఎస్.వి. కృష్ణారెడ్డి,కె.అచ్చిరెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 3, తల్లాడ రిపోర్టర్ సరికొత్త సంకల్ప సాధన దిశగా కొత్త సంవత్సరంలో అడుగులు వేయాలని సుప్రసిద్ధ సినీ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి,కె.అచ్చిరెడ్డి ఆకాంక్షించారు. తల్లాడ మండలం, అన్నారుగూడెం గ్రామానికి చెందిన దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను గురువారం ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావుతో కలిసి వారు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ఎప్పుడైనా గడిచిన కాలం అనుభవాలతో భవిష్యత్తులోకి అడిగిడుతుందని, కాలం మును ముందుకే నడుస్తుందన్నారు .కాలంతో పాటు కదలడం మానవ లక్షణమని,చైతన్య సాకారమైన కాల పరిణామాలకు అనుగుణంగా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని వారు హితవుపలికారు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మార్పుకు నూతన సంవత్సరం నాంది పలకాలని వారు కోరారు. చలనచిత్రరంగంలో దర్శక దిగ్గజం, బహుముఖ ప్రజ్ఞాశాలి, సామాజిక సేవస్ఫూర్తి ప్రదాతలైన దర్శకరత్న దాసరి నారాయణరావు- పద్మ దంపతుల స్మారకార్ధం దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి గుమ్మా నరేష్ చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, గుడా రామకృష్ణ, అడపాల వెంకటేశ్వరావు, దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు గుమ్మా నరేష్, సమన్వయకర్త దుగ్గిదేవర అజయ్ కుమార్, కార్యదర్శి తిగుళ్ళనరసింహారావు, రాయల శ్రీనివాసరావు (చంటి), కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *