పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 3 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమం ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి మధు ఆధ్వర్యంలో పలాస మండలం సున్నాడ గ్రామం మండల ప్రజా మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఘనంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జై వెంకటలక్ష్మి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2021లో కళాశాల స్థాపించబడినప్పటి నుంచి నిర్వహిస్తున్న తొలి ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం ఇదే అని తెలిపారు. ఈ శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విద్యార్థులకు పలు దిశానిర్దేశాలను సూచిస్తూ, సమాజ సేవలో ఎన్‌ఎస్‌ఎస్ పాత్ర ఎంతో ముఖ్య మైనదని పేర్కొన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సున్నాడ గ్రామం మండల ప్రజా మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం మధురావు,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.