సేవ్ ద ఓల్డ్ పూర్ టీం ఆధ్వర్యంలో పేద ప్రజలకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు నిత్యవసర సరుకులు, అందజేత

★ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సేవ్ ద ఓల్డ్ పూర్ టీం ★ మానవసేవే మాధవ సేవగా సాగుతున్న సేవ్ ద ఓల్డ్ పూర్ టీం సేవలు

పయనించే సూర్యుడు, జనవరి 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో విస్తరిస్తున్న సేవ్ ద ఓల్డ్ పూర్ టీం సేవలు . బూర్గంపాడు భద్రాచలం పరిసర ప్రాంతంలో కొంతమంది యువకులు కలిసి సేవ్ ద ఓల్డ్ పూర్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ టీం ద్వారా నిరుపేద ప్రజలకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు ,అనారోగ్యంతో నిరుపేదలను గుర్తించి వారికి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ సేవ్ ద ఓల్డ్ పూర్ టీం లో సుమారు 370 మంది సభ్యులు ఉన్నారని సభ్యులందరూ ప్రతినెల స్వచ్ఛందంగా 100 నుండి 200 రూపాయలు వేసుకొని పేద ప్రజలకు ,ఒంటరి మహిళలకు, వృద్ధులకు ,అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సేవ్ ద ఓల్డ్ పూర్ టీం ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, అందజేయడం జరుగుతుందన్నారు . దుమ్ముగూడెం మండలం,బూర్గంపాడు మండలం ,భద్రాచలం మండలం, కుకునూరు మండల పరిధిలో సుమారు 45 మందికి సహాయం అందించడం జరిగిందని సుమారు లక్ష రూపాయల వరకు సహాయం చేశామని మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని, మా టీమ్ కు సహాయం అందించాలనుకునేవారు 9908477092 ప్రేమ్ ను సంప్రదించగలరు అని కోరారు. సేవ్ ద ఓల్డ్ పూర్ టీం కి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నమన్నారు ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రేమ్ , పుట్టి పవన్ ,బండ ప్రదీప్ , వీరన్న, రమణ , రవి , చందు ,నాగేశ్వరావు, సతీష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు