పయనించే సూర్యుడు జనవరి 3 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలంలోని ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు సురికి వినయ్ కుమార్, వట్టెపు శివకుమార్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది కేవలం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు, భారతదేశానికి స్వాతంత్రం రావాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు, నేటికి, నాటికి భారతదేశంలోని విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తూ, ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఏకైక సంస్థ ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజురీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హర్షిత, హబీబా, అక్షర, అనూష,కార్తీక్, జీవన్ , కావ్య, సింధు, మౌనిక , నికిల్, జశ్వంత్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.