పయనించే సూర్యుడు జనవరి 3 నాగర్ కర్నూల్ జిల్లా రిపోర్టర్ కే.శ్రవణ్ కుమార్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో శుక్రవారం నాడు బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంను డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ వి.శేఖర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి.హనుమంతు రావు, నాగర్ కర్నూలు జిల్లా లైన్స్ క్లబ్ జిల్లా కోఆర్డినేటర్ హాకీమ్ విశ్వప్రసాద్, అధ్యక్షులు నరేందర్ రెడ్డి,సభ్యులు ప్రేమ్ కుమార్ రెడ్డి,మౌనిక రెడ్డి లు స్వయంగా రక్తదానం చేశారు. జిల్లా యువశక్తి సభ్యులు యువత, ఆస్పత్రి నర్సింగ్ అధికారులు రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వైద్యులను, నర్సింగ్ అధికారులను, యువతను, లైన్స్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.రక్త దాతలకు బ్లడ్ డోనర్ సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏ. రోహిత్, లైన్స్ క్లబ్ ప్రాంతీయ సభ్యులు, జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, రాధాకృష్ణ, తేప్ప శ్రీనివా సులు,దర్శి రాజయ్య, లక్ష్మీ నరసింహ గౌడ్, యువశక్తి సభ్యులు మధు, నర్సింగ్ అధికారులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఆంజనేయులు గౌడ్, ఫయాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.