ఈదమ్మ మాత అలయ నిర్మాణానికి విరాళం

★ పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్

పయనించే సూర్యుడు, జనవరి 4 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం దొడ్లపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, నూతనంగా నిర్మాణము జరుగుచున్న శ్రీ ఈదమ్మ మాత భూగర్భాలయం యొక్క నిర్మాణం కోసం పోతేపల్లి సర్పంచ్ నీ కలవడం జరిగింది. వెల్దండ మండలం పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ శనివారం ఆలయ నిర్మాణ పనులు నిమిత్తం రూ 10116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎంతో మహిమ గల దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఈదమ్మ మాత అలయ నిర్మాణంలో తాము కూడా భాగస్వాములు కావటం మా అదృష్టంగా బావిస్తున్నామని అన్నారు. దొడ్లపల్లి ఈదమ్మ మాత కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులు శ్రీ ఈదమ్మ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొడ్లపల్లి శ్రీ ఈదమ్మ మాత ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.