ఉత్సాహంగా సాగిన ముగ్గుల పోటీలు

★ విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచులు

పయనించే సూర్యుడు జనవరి 4 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనవరి మాసం నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని ముత్తారం మహిళ గ్రామైఖ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో విజేతలుగా నిలిచిన మహిళలకు గ్రామ సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మాట్ల హరికుమార్ మొదటి, రెండు మూడు, ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరిగింది. విజేతలలో ఐదుగురు మహిళలను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వారు తెలిపారు. ఈ నెల 6న మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఊరడి భారతి జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్, మాట్ల హరి కుమార్, వార్డు మెంబర్లు మ్యాక నరేష్, కొర్ర తిరుపతి, కడారి ప్రభాస్, దొండ మౌనిక, రేణికుంట్ల సందీప్, పాఠశాల ఉపాధ్యాయులు ప్రియదర్శిని, వివో అధ్యక్షురాలు మాడుగుల నిర్మల, వివోఏ కడారి సోని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..