పయనించే సూర్యుడు, జనవరి 4 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఉపసర్పంచ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉప సర్పంచ్ లు సమావేశం ఏర్పాటు ఉప సర్పంచ్ సంగం మండల అధ్యక్షులుగా బస్నమోని శ్రీను ముదిరాజ్, బండోనిపల్లి ఉపసర్పంచ్ అల్వాల్ యాదవ్ ను ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ సమావేశానికి మండలంలోని ఉపసర్పంచులు హాజరై అధ్యక్ష ఉపాధ్యక్షులను ఏకగ్రీవంగా చేసినందుకు ఉప సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.