ఎమ్మెల్యే బీవీ చేతులమీదుగా రైతులకు పట్టధార పాస్ పుస్తకాలు పంపిణి

★ వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో, చంద్రన్న పాలనలో రాజముద్రతో పట్టాదార పుస్తకం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 04: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ నాయుడు మండలపరిధిలో కున్నూరు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో ఉన్న రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసినా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి వైసీపీ హయాంలో జగన్ బొమ్మతో భూమి హక్కు పత్రాలు, సర్వే రాళ్ళు ఉండటం, రీ సర్వే కూడా తప్పుల తడకగా ఉండటంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే రీ సర్వే తప్పులను సరిదిద్ది ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇస్తామన్న చంద్రబాబు హామీని ఇప్పుడు నెరవేరుస్తూ పాసుపుస్తకాలను ఎమ్మిగనూరు శాసన సభ్యులు డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. అలాగే రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దారు, అధికారులు ఏఎంసీ చైర్మన్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు, భాస్కర్ల చంద్రశేఖర్, మండల నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.