
పయనించే సూర్యుడు జనవరి 4 కరీంనగర్ న్యూస్: త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఎంఐఎంలు ఒకటయ్యాయని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఆ మూడు పార్టీలు లోపాయికారి ఒప్పందాల తో ముందుకు కొనసాగుతున్నాయని నగరపాలక సంస్థను ఎంఐఎం చేతిలో పెట్టడానికి కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు రాజకీయాలు చేస్తున్నాయని బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆరోపించారు శనివారం రోజున కొత్తపల్లీ బిజెపి ముఖ్య నేతల సమావేశం జరిగింది ఇట్టి సమావేశానికి బోయిన్పల్లి ప్రవీణ్ రావ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు కార్పొరేషన్ ఎన్నిక కోసం బీజేపీ నేతలు అనుసరించాల్సిన విధానంపై ప్రవీణ్ రావు మార్గం నిర్దేశనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రజాకర్ వారసుల పార్టీ కాంగ్రెస్ బి ఆర్ ఎస్ లఅండ చూసుకొని కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని పగటి కలలు కంటుందని ఎద్దేవా చేశారు దశాబ్ద కాలంగా కరీంనగర్లో ఎంఐ ఎం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని అలాంటి పార్టీ నేడు కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామని ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాటి పాత మిత్రులు బి ఆర్ ఎస్ నేటి కొత్త మిత్రులు కాంగ్రెస్ తో కలిసి లోపాయికారి కారి ఒప్పందాలతో కార్పొరేషన్ ఎన్నికల కు వెళ్లే ఆలోచనలో ఎంఐఎం ఉందన్నారు కరీంనగర్ పట్టణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని , కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎంల రాజకీయ డ్రామాలను గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు కరీంనగర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని, స్మార్ట్ సిటీతో కరీంనగర్ రూపురేఖలు మార్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ చేసిన కృషి కారణంగా వందల కోట్ల నిధులతో కరీంనగర్ పట్టణ రూపురేఖలు మారాయన్నారు కరీంనగర్ లో రామరాజ్య పాలన తెస్తాం కరీంనగర్ బల్దియా పై కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు
