పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి- జనవరి-04:- హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో గోదావరిఖని సెయింట్ క్లెయిర్ హై స్కూల్ లో రెండవ తరగతి చదువుతున్న చిన్నారి పెద్దల తన్స్వీక తన ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవార్డును దక్కించుకున్నారు. చిన్న వయసులోనే కూచిపూడి నృత్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ అవార్డు సొంతం చేసుకోవడంతో స్కూల్ స్కరస్పాండ్ డేవిడ్, ఎనిమిదవ కాలనీకి చెందిన తమ తల్లిదండ్రులు ఆంజనేయస్వామి, లత, సంతోషం వ్యక్తం చేశారు. ఈ కాలంలో విదేశీ సంస్కృతి ఉన్న విలువలు మన దేశ సంస్కృతి పై లేదు అని చెప్పుకునే స్థాయిలో నేడు మనం ఉన్నాం అంతరించి పోతున్న మన సంప్రదాయాలు , కళాలు నుండి ఒక్కటైన కూచిపూడి నృత్యం నేర్చుకోవడం తో పాటు చిన్న వయసులోనే స్టేజ్ పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం.వారికి ఉన్న పట్టుదల, నిబద్దతకి నిదర్శనం వారి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించడం అనేది ఎంతో ముఖ్యం. చిన్నారులను వారి అభిరుచులకు అనుగుణంగా తల్లి తండ్రులు ప్రోత్సహించడం శుభ పరిణామం. ఇంకా చిన్నారి తన్స్వీక భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు ఎన్నో గెలుచుకోవాలని ఆశిద్దాం.
