పయనించే సూర్యుడు, జనవరి 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం కోన్నే గ్రామంలో శివ ముక్కోటి పౌర్ణమి పురస్కరించుకొని గణపతి సహిత గాయత్రీ మృత్యుంజయ రుద్ర హోమం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయంలో ఆలయ పూజారి కుందారపు విష్ణుమూర్తి మరియు పురోహితులతో గ్రామ సర్పంచ్ కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వెలుగొందాలని, సర్వేజనా సుఖినోభవంతు అని ఆ భగవంతున్ని ప్రార్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మరియు ఒకటో వార్డు సభ్యులు కుందార సునీత గోపాల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.