గట్ల నర్సింగాపూర్ లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు జనవరి 4 ఎన్ రజినీకాంత్:- సంక్రాంతి సందర్భంగా గట్లనర్సింగాపూర్ గ్రామములో శనివారం ముగ్గుల పోటిలను శివాలయం ముందు ఉన్న స్థలములో నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటిలలో 25 మంది పాల్గొన్నారు. న్యాయనిర్ణేతలుగా గ్రామ సర్పంచ్ బొల్లంపల్లి అజయ్‌కుమార్, కార్యదర్శి గుడికంధుల మధు వ్యవహరించారు. ఈ నెల 6వ తేదీన మండల స్థాయీలో జరిగే పోటిలకు ఐదుగురుని ఎంపిక చేయడం జరిగింది. 1. కుక్కమూడి ఐశ్వర్య, 2. సట్ల మౌనిక, 3. వోడ్నాల శ్రీవిద్య, 4.కోతి సుస్మిత 5. బొల్లంపల్లి ప్రణిత లను ఎంపిక చేసి సర్పంచ్ ఐదుగురికి చీరలను బహుమతిగా ఇవ్వడం జరిగింది.. పోటీలో పాల్గొన్న 25మందిని కూడా పోటీలో గెలుపోటములు సహజం అని చెప్పి నిరాశచెందకుండా మరొక్కసారి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా గెలుస్తారని పోటిలో పాల్గొన్నవారంధిరికి ప్రోత్సహకంగా సర్పంచ్ 25 పెన్నులను బహుమానంగా అందిచారు.. ఈ కార్యక్రమములో సర్పంచ్ అజయ్ కుమార్, కార్యదర్శి, గ్రామ వార్డ్ సభ్యులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు, ముగ్గురు విఓ సంఘాల సి ఎ లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..