గల్ఫ్ దుబాయ్ వారధి సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సాయం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 04 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన నాయకపు ఎర్రం భీమయ్యకు గల్ఫ్ దుబాయ్ వారధి సంఘం ఆధ్వర్యంలో రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. భీమయ్య పేద కుటుంబానికి చెందినవాడై, ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గల్ఫ్ దుబాయ్ వారధి సంఘం సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే తమ సంఘం లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ వారధి సంఘం సభ్యులు బట్టు నర్సయ్య, వట్టిమల్ల శ్రీనివాస్, బేతి వంశీ, గ్రామ సర్పంచ్ మోహన్, మాజీ సర్పంచ్ వాసరి రవి, ఉప సర్పంచ్ ఇద్దం సుధీర్ రెడ్డి, గ్రామ రామాలయ కమిటీ చైర్మన్ కోల రాజు, వార్డు సభ్యులు బోలిశెట్టి నారాయణ, నాయకులు దుగ్యాల లక్ష్మిపతి రావు, బేతి మల్లారెడ్డి, ఇద్దం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.