పయనించే సూర్యుడు జనవరి 04 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్ మండలంలో అర్హులైన గిరిజనులకు నివాస స్థలాలు కేటాయించాలని రాజ్ గోండ్ సేవా సమితి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గెడం నిరంజన్ డిమాండ్ చేశారు ఈ మేరకు నాయకులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఎక్స్‌రోడ్, నాగపూర్ శివార్లలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నివాస భూములు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాలందరికీ వెంటనే స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు.